కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం

రూ.2.32 కోట్ల కళ్యాణలక్ష్మి చెక్కులు
రూ.64.28 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు
232 మందికి కళ్యాణలక్ష్మి, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు .. మొత్తం 437 మంది లబ్దిదారులకు పంపిణీ
గడపగడపకూ సంక్షేమం
వాడవాడలా అభివృద్ధి
పేదలకు అండగా కేసీఆర్ సర్కార్
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సాయం
సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్
తెలంగాణ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శం
ప్రపంచదేశాలకు భారతదేశాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష
నాడు రాష్ట్రం టీఆర్ఎస్ నేడు దేశంకోసం బీఆర్ఎస్
రైతేరాజు ఇప్పటివరకు రాజకీయ పార్టీల నినాదం
రైతును రాజును చేయడమే బీఆర్ఎస్ విధానం
కేంద్రంలో రైతుప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతాం
బీజేపీ పాలనలో భారంగా మారిన వ్యవసాయం
రైతురాజ్య స్థాపన కోసం రాజీలేని పోరాటం చేస్తాం
వనపర్తిజనం సాక్షి డిసెంబర్ 16
వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 232 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తెలంగాణ ఆడపడుచుల పాలిట ఒక వరం అని నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులు పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు ఎలాంటి కష్టం పడకూడదని ఎంతో ముందు చూపుతో ఈ పథకాన్ని అమలు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.