*కళ్యాణ లక్ష్మి పేదలకు వరం. *ఎమ్మెల్యే గండ్ర.

14( జనం సాక్షి) కళ్యాణ లక్ష్మి పేదలకు వరం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు రూ: 47,5,542 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయా గ్రామాలలోని లబ్ధిదారులకు అంధజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ పేదింటి మహిళలకు కల్యాణ లక్ష్మి గొప్ప వరమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి మహిళలకు మేనమామగా పేరు ప్రఖ్యాతులు గడించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి, తహసిల్దార్ సుమన్, ఎంపీడీవో కృష్ణవేణి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.