కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంథని మండలం(40), ముత్తారం మండలం (5), కమాన్ పూర్ మండలము (6), రామగిరి మండలం(18)పాలకుర్తి(10) కల్యాణ లక్ష్మి చెక్కులను మొత్తం 89 లబ్ధిదారులకు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన 10 సీఎంఆర్ఎఫ్ చేక్కులను లబ్దిదారులకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పంపిణీ చేశారు.