కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేత

మోత్కూరు జూలై   జనంసాక్షి : మండలంలోని దత్తప్పగూడెం లో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు నోట్ పుస్తకాలు,జామెట్రీ బాక్స్, డిక్షనరీ, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ తో పాటు బాలికలకు సానిటరీ కిడ్స్ అందజేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు విలువ చేసే సామగ్రిని ప్రతి విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కత్తుల ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ తన స్నేహితుడైన శ్రీ చరణ్ మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చేయూత నివ్వడం చాలా గొప్ప విషయం. ఈ సంస్థ ద్వారా ఇంకా అనేక మంది విద్యార్థులకు సహాయం అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నవీన్,జహంగీర్ పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు రామకృష, శ్రీధర్,వెంకటేష్,సతీష్,నాగయ్య,శ్రీలత,స్వప్న, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Attachments area