కస్తూర్బా పాఠశాలలో స్పీకర్ ఆకస్మిక తనిఖీ
సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం
కామారెడ్డి,డిసెంబర్10(జనంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో కలియదిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన స్పీకర్.. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వస్తున్నారా.. అని విద్యార్థులను అడిగారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు బుద్ధిగా వినాలన్న స్పీకర్.. చదువులో రాణించాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉత్తమ విద్యార్థులుగా తయారవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని స్పీకర్ పోచారం అన్నారు. యువత ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలన్నారు.