కాంగ్రెస్‌లో గెలిచి.. బీజేపీలోకి జంప్‌ అవుతారు!!

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు బీజేపీలోకి జంప్‌ అవుతారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అధికారం ఇచ్చినా ఏమీ చేయలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉందని, కేవలం హామీలతో ప్రలోభ పెట్టాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లు కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర్‌మెంట్‌ పెడతారని ఎద్దేవా చేశారు. షాద్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లకు అదానీ డబ్బులు వస్తున్నాయని, అందువల్ల కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను దబాయించి డబ్బులు అడగండని అన్నారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసిపోయారని, అందువల్ల ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంపైపోతారని అన్నారు.