కాంగ్రెస్‌,కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారు

3
– కేరళ ఎన్నికల ప్రచారసభలో మోదీ

తిరువనంతపురం,మే8(జనంసాక్షి):కేరళలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. ఐదేళ్లు విూరు పాలిస్తే? ఐదేళ్లు మేము పాలిస్తామన్నట్లుగా ఇరు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయన్నారు. ఇన్నేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కేరళలో నీటి సమస్య తీర్చడంలో విఫలమైందన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుట్టనాడులో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. అవినీతి పాలనలో కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాల మధ్య అనుబంధం విడదీయరానిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యూపిఏ పాలనలో 2జి, బొగ్గు కుంభకోణం సహా అనేక స్కాములతో కాంగ్రెస్‌ పార్టీ 40 సీట్లకు పరిమితమైందని చెప్పారు. ఇటు కేరళలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ చెరి ఐదేళ్లు అవినీతికర పాలన చేస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని మోదీ ఆరోపించారు. కేరళలో సోలార్‌ స్కామ్‌ జరగడంపై కూడా మోదీ ఊమెన్‌ చాందీ సారధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మోదీ విమర్శించారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ కాసరాగోడ్‌, అలప్పుఝా, త్రివేండ్రం జిల్లాల్లో జరిగిన అనేక సభల్లో పాల్గొన్నారు.