కాంగ్రెస్‌, టీడీపీి హటావో…. తెలంగాణ బచావో

సుబేదారి ఆగస్టు 1, (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై జరిగే పొరాటంలో కాంగ్రెస్‌ టీడీపీ హఠా వో..తెలంగాణ బచావో అనే నినాదంతో పోరాడాలని టీఆర ్‌ఎస్‌ నేత సిద్ద్దిపెేట ఎమ్మెల్యే  హరీష్‌ రావు ఆటోడ్రైవర్లకు పిలుపుని చ్చారు. బుధవారం హన్మకొండలోని ఆదాలత్‌ అమరవీరుల సెంటర్‌ లో తెలంగాణా ఆటో డ్రైవర్స్‌ జిల్లా యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు గుడి మళ్ల రవి కుమార్‌ ఆధ్వర్యంలో  ఆటోడ్రైవర్ల ఒక రోజు దీక్షకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లా డుతూ తెలంగాణా జిల్లాలలో 5 వేల మంది ఆటో డ్రైవ ర్లు ఉన్నారని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ఆటో డ్రైవర్ల పాత్ర కీలక మైందన్నారు. గత సంవత్సరం జిల్లాలో నిర్వహించిన సకలజనుల సమ్మెలో కూడా ఆటో డ్రైవర్లు కీలక పాత్ర వహించరని ఆయన కొనియాడారు. సమై క్యరాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు మనుగడ కరువైందని ఆర్టీఏ పోలీసుల వేధింపుల వల్ల డ్రైవర్ల బ్రతుకులు  రోడ్లెకాయని,డ్రైవర్ల సమస్యలు పరి ష్కారం కావాలంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముఖ్యమైందని ఆయన అన్నారు.  తెలంగాణ రా ష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సమైఖ్య వా దులంతా ఒకటయ్యరని ఆయన విమర్శించారు. నాడు మహ బూబాద్‌, జగన్‌ పర్యటనను  అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 5 వేల మంది పోలీసులను దించి  తెలంగాణ ప్రజల ప్రాణాలను బలిగొ న్నారని, వైఎస్సార్‌సీపీ గౌరవధ్యక్షురాలు  విజయమ్మ సిరిసిల్ల పర్యట నను  తెలంగాణ వాదులు అడ్డుకునే ప్రయత్నంలో 5వేల మంది పోలీసులతో  తెలం గాణ వాదులను అరెస్టు చేసి వారి సమైఖ్యవాదన్ని బయలుపర్చారని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ప్రచా రంలో టీడీపీ  తెలంగాణ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌ రావు  తెలం గాణ ఏర్పాటు కై  కేంద్రానికి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తో లేఖ ఇప్పిస్తానని చెప్పి ఎన్నికలు జరిగి నెల రోజులు దాటిన ఇంత వరకు లేఖ ఇప్పిచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. బీసీిలకు రాబోయే ఎన్నికలలో వంద సీట్లు ఇస్తానని అంటున్న చంద్ర బాబు బిసిలకు శాసన సభలోప్రతి పక్ష నేత పదవి కాని పార్టీ అధ్యక్ష కాని ఇవ్వకుండా రెండు పదవులను నిర్వహించడం ఎంతవరకు సబ బు అని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే  తెలం గాణలోని ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం 100 కోట్లతో కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఆయన హమీ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అతి సమీపంలో ఉందని టి ఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షు డైన చంద్రశేఖర్‌ రావు ఆధ్వర్యంలో తెలంగా  రాష్ట్రం ఏర్పడనుందని ఆయన జోస్యం చెప్పారు. కెసిఆర్‌ సచ్చుడో తెలంగాణా తెచ్చుడో అనే నినదాంతో పార్టీ అధ్యక్షుడు ముందకు వస్తున్నాడని, తెలంగా ణా ప్రజలంతా ఒక్క తాటి పై నిలడి రాష్ట్రం ఏర్పాటు కై పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణాలోని ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారానికై టిఆర్‌ఎస్‌ పార్టీ మొత్తం ఆటో డ్రైవర్ల వెంట వెన్నుదట్టి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామి ఇచ్చారు. జిల్లా లోని ఆటో డ్రైవర్లకి వరంగల్‌ పశ్చి ఎమ్మెల్యే దాస్య వినయ్‌ భాస్కర్‌, స్టేషన్‌ ఘణపూర్‌ ఎమ్మెల్యే, రాజయ్య, పరకాల ఎ మ్మెల్యే బిక్షపతి, బాసటగా నిలుస్తారని ఆయన ఈ సందర్భంగా తెలి యజేశారు. అనంతరం దీక్షలో కుర్చున్నవారికి హరీష్‌ రావు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐజిల్లా అధ్య క్షుడు శ్రీనివాస రావు. టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో స భ్యుడు డాక్టర్‌ పరమేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరెడ్డి, కేయూ ప్రోఫెసర్‌ సీతరామ్‌నాయక్‌, గౌరవ జిల్లా అధ్యక్షులు ఆటో డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు, ఆటోడ్రైవర్లు పాల్గోన్నారు.