కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర భగ్నం

3
నాంపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు

పొన్నాల చేతికి తీవ్రగాయం

కంటతడిపెట్టిన టీపీసీసీ చీఫ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): సచివాలయ తరలింపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర చేపట్టారు. గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు నేతలు పాదయాత్రగా బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని వారి ప్రయత్నాన్ని వమ్ముచేశారు. ఈ ర్యాలీని నాంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు చేతికి తీవ్ర గాయం కావటంతో ఆయన్ను 108లో నిమ్స్‌కు తరలించారు. గాయం కారణంగా పొన్నాల కంఠతడిపెట్టుకున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు, ఎర్రగడ్డ చెస్టు ఆస్పత్రిని వికారాబాద్‌కు  తరలించాలని ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గాంధీభవన్‌ నుంచి రాజ్‌ భవన్‌ కు పాదయ్రాత చేపట్టింది. మార్గంమధ్యలో నాంపల్లి రైల్వే స్టేసన్‌ ముందు పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో ఆగ్రహించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య రోడ్డుపై భైటాయించారు. పొన్నాలతో పాటు నేతలను, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు టీఆర్‌ ఎస్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. పోలీసులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పోలీసులు భారీగా మోహరించి వీరు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు.  దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు  కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని డీసీసీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వారు పాదయాత్ర చేశారని వెల్లడించారు. అందుకే వారిని అరెస్ట్‌ చేసి గోషామహాల్‌ పీఎస్‌కు  తరలించినట్లు చెప్పారు. అయితే వారిపై ఏ కేసులు పెట్టాలో పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ నేతలు శనివారం చేపట్టిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతోపాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జానారెడ్డి, డి.శ్రీనివాస్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌,బలరాం నాయక్‌ ,షబ్బీర్‌ అలీ, గండ్ర, వీహెచ్‌, దానం సహా పలువురు నేతలలను  నాంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయ తరలింపును నిరసిస్తూ పాదయాత్ర చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. అయితే అక్కడ కూడా నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసుల తోపులాటలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల చేతికి స్వల్ప గాయమైంది. పొన్నాలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వెంటనే 108లో నిమ్స్‌కు తరలించారు.

పోలీసుల వైఖరి గర్హనీయం : జానారెడ్డి

సచివాలయ తరలింపును నిరసిస్తూ గోషామహల్‌ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు.  పోలీసుల తోపులాటలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల చేతికి తీవ్ర గాయం కావడంతో పోలీసుల వైఖరిపై మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. పోలీసుల వైఖరి గర్హనీయమని, వాళ్లు అలా ప్రవర్తించకూడదని అన్నారు. గతంలో జరిగిన ఎన్నో ఆందోళనలకు తాము అనుమతి ఇచ్చినట్లు గుర్తుచేశారు. టిఆర్‌ఎస్‌ నేతలు ఇంతకన్నా దారుణంగా వ్యవహరించిన ఘటనలు ఉన్నాయన్నారు. తాము శాంతియుతంగా  ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడందారుణమని మాజీ ఎంపి అంపన్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సచివాలయం తరలింపు దారుణమన్నారు. దీనిపై శాంతియుతంగా వెల్లి గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వాలనుకున్నామని అన్నారు. అంతలోనే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఇది తగదన్నారు. తమను అడ్డుకోవడం వల్ల సమస్య పరిస్కారంకాదని, టిఆర్‌ఎస్‌ ప్రబుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని  మాజీమంత్రి బలరాం నాయక్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత నిరంకుశత్వం పనికి రాదన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మాజీ పిసిసి చీఫ్‌ డిఎస్‌ మండిపడ్డారు. సచివాలయం తరలింపు దారుణమన్నారు. అంతకుముందు గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్‌ నేతలను నాంపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు.