కాంగ్రెస్ వల్లనే తెలంగాణలో బలిదానాలు
ఇందుకు బాధ్యత ఆ పార్టీదే
తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌కే సాధ్యం
తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక¬దా ప్రకటిస్తారా
26న వరంగల్‌లో సిఎం కెసిఆర్ సభలు
ఏర్పాట్లను పరిశీలించిన కడియం తదితరులు
వరంగల్,నవంబర్24(జనంసాక్షి): అనేక మంది తెలంగాణ బిడ్డల బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణలో కెసిఆర్ వల్లనే అభివృద్ది సాగుతోందని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేయడం, తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న భయంతో అనేక బలిదానాలు జరిగాయని అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన వరంగల్‌లో జరిగే సిఎం కేసిఆర్ సభ ఏర్పాట్లను హన్మకొండ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో , పరకాల నియోజకవర్గంలోని వాగ్దేవి కాలేజీ మైదానంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి దాస్య వినయ్ భాస్కర్, పరకాల నియోజక వర్గ టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణను బిడ్డగా,తెలంగాణకు తల్లిగా అభివర్ణించుకున్న సోనియాగాంధీ తెలంగాణ గడ్డ విూద నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దా ఇస్తామని ప్రకటించడం తెలంగాణను అవమానించడమే అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక ¬దా ఇవ్వడానికి మేము వ్యతిరేకం కానప్పటికీ ఆంధ్రకు ప్రత్యేక ¬దా ఇస్తే సబ్సిడీల కోసం పరిశ్రమలన్నీ అక్కడికే తరలివెళ్తాయన్నారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణకు ప్రత్యేక ¬దా ప్రకటన ఇప్పించకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మోసం తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నారు. గత నాలుగేళ్ల సిఎం కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి చెందిందన్నారు. ఆర్ధికవృద్ధి రేటులో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తలసరి కరెంటు వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇవన్నీ గత నాలుగేళ్లుగా తెలంగాణ సాధించిన విజయాలు. ఇవి సోనియాగాంధీకి కనిపించడం లేదా? అవగాహన లేకుండా సోనియగాంధీ మాట్లాడుతున్నారు. 43వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఇవన్నీ ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి. అందుకే సిఎం కేసిఆర్ సభలకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు. మా అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని, కాంగ్రెస్ వ్యూహంలో ఇరుక్కున్నామని చెబుతున్న కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు. మహాకూటమిలో భాగంగా మిత్ర పక్షాలకు సీట్ల సర్దుబాటు చేసి ఇచ్చిన సీట్లలో బి.ఫారాలిచ్చి మిత్రపక్షాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయదనే నమ్మకం లేదని చెప్పలేమన్నారు. మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రాంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నాలుగు పార్టీలు ఎవరికీ వారే మేనిఫెస్టో ప్రకటించుకున్నారు. పొరపాటున వీరు అధికారంలోకి వస్తే ఎవరి మేనిఫెస్టో అమలు చేస్తారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను మోసం
చేయడానికే మహాకూటమి పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఎన్ని సభల్లో తిరిగితే టిఆర్‌ఎస్ పార్టీకి అంత మేలు జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ, కేసిఆర్ పట్ల ప్రజల్లో బ్రహ్మండమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అందుకే సభలకు భారీ ఎత్తున హాజరై ఆశీర్వదిస్తున్నారని కడియం అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ మరోసారి సిఎం అయితేనే ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని, దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతాయని నమ్ముతున్నారు.
టిఆర్‌ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలను రెండింతలు చేసి అమలు చేస్తారు. టిఆర్‌ఎస్ పార్టీ పాక్షిక మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అందుకే టిఆర్‌ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని అనుకుంటున్నారు. సిఎం సభకు భారీ ఎత్తున హాజరవుతున్నారు.
వరంగల్ లో ఇప్పటికే సిఎం కేసిఆర్ 5 నియోజక వర్గాల సభల్లో పాల్గొన్నారు. పాలకుర్తి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, జనగామ నియోజక వర్గాల్లో నిర్వహించిన సభలకు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు వచ్చి ఆశీర్వదించారు. కేసిఆర్ మరోసారి సిఎం కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. . ఈ నెల 26వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వాగ్దేవి కాలేజీ మైదానంలో పరకాల నియోజక వర్గ సభ, సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జరిగే వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధనపేట నియోజక వర్గాల ఉమ్మడి సభకు భారీ ఎత్తున వచ్చి దీనిని జయప్రదం చేయాలని కోరారు.