కాంగ్రెస్‌ సర్కార్‌కు నూకలు చెల్లాయి:నారయణ

హైదారాబాద్‌: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వనికి నూకలు చెల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ అన్నారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి విద్యుత్‌ ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని నారయణ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఉద్యమాలతో బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కుంభకోణాలతో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దేశప్రగతిని కుంటుపరిచారని ఆయన విమర్శంచారు.