కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ నామినేషన్

77777హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నామినేషన్ వేశారు. అంతకముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక అయినా సిరిసిల్ల రాజయ్య పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో సర్వేను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

అధిష్టానం ఆదేశాలతో సర్వే వరంగల్ ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నారు. అయితే రాజయ్యను ఎంపిక చేయకముందే ఆయన వరంగల్ స్థానాన్ని ఆశించారు. ఊహించని పరిణామాలతో చివరికి ఆయనకే టిక్కెట్ దక్కింది. నామినేషన్ వేసేందుకు సర్వే బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్ కు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.