కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర-ఎంపిపి అలేఖ్య

పెనుబల్లి, అక్టోబర్ 31(జనం సాక్షి )
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రక్తాలు పారిన చరిత్ర అందరికీ తెలిసిందేఅని ఆ సంస్కృతిని మళ్లీ పచ్చని తెలంగాణలో తిరగరాయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఎంపీపీ లక్కినేని అలేఖ్యకాంగ్రెస్ పార్టీ పై ధ్వజమెత్తారు.మంగళవారం
వి.ఎం బంజర్ లో ఎంపీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ
ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ హింసకు పాల్పడుతుందని పచ్చని తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు,ఎన్నో ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారని, తెలంగాణలో ప్రతి బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ చల్లగా ఉంటున్నారని ఇది చూసి ఓర్వలేక కడుపు మంటతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసకు తెరలేపారని అన్నారు,
యావత్ తెలంగాణ ప్రజానీకం లోతుగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు, రక్తాలు పారించే కాంగ్రెస్ పార్టీ కావాలా,పచ్చని పల్లెలు ప్రశాంతంగా ఉండే కెసిఆర్ పాలన, కావాలాఅని తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు,
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుండి చెబుతూనే ఉన్నారని, కాంగ్రెస్,బిజెపి నాయకులు సంఘ విద్రోహ నాయకులుగా మాట్లాడుతున్నారని అదే క్రమంలో రేవంత్ రెడ్డి,అరవింద్, బండి సంజయ్,ఈటెల రాజేంద్ర వంటి నాయకులు మొదటి నుండి ఎన్నికల సమయంలో ఏదో విధంగా గొడవలు తలెత్తాలనె తరహాలో చూస్తున్నారని కేసీఆర్ చెబుతూనే ఉన్నారనిఅన్నారు , ప్రజలు ఈ పరిస్థితిని గమనించి కాంగ్రెస్ వాళ్లను తరిమికొట్టేలా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు,
దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపించాలికానీ దొంగచా టుగా కత్తిపోట్లు దించడం హేయమైన చర్యని ఇది తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు,
తెలంగాణ ఆషామాషీగా రాలేదని, తెలంగాణ కెసిఆర్ అడ్డ అని ఇక్కడ ఎవరి కుట్రలు కుతంత్రాలు చెల్లవని ఇక్కడ ఉన్నది బాహుబలి లాంటి కేసీఆర్అనిదమ్ముంటే ఎన్నికల్లో మీ సత్తా చూపించాలని అన్నారు,అంతేకానీ ఇలా వ్యక్తులపై దాడి చేయడం సిగ్గుచేటు నీతిమాలిన పని అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు,
తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని ఎవరెన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతారని అన్నారు,