కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్

రుద్రంగి జూలై 20 (జనం సాక్షి)
రుద్రంగి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆది  శ్రీనివాస్ మాట్లాడుతూ…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ నాయకత్వాలపై కుట్రలు చేస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ లకు ఈడి  నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నమని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈడి  ద్వారా నోటీసులు జారీ చేస్తూ  కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని చూస్తుందని అన్నారు.రాబోవు ఎన్నికల్లో
కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే ముందస్తు సమచారంతో సోనియాగాంధీ  కుటుంబంపై బిజెపి ప్రభుత్వం ఈడి  ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని చూస్తుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవించారని అన్నారు.బిజెపి టీఆరెస్ ప్రభుత్వల పరిపాలనలో
సామాన్య ప్రజలు బ్రతకడమే కష్టంగా మారిందని అన్నారు.ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోవు ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శిచెలుకల తిరుపతి,మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్,గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,గుగ్గిళ్ల వెంకటేష్,ఎర్రం గంగానర్సయ్య,గట్ల ప్రకాష్,గొడికర్
హీరోజ్,అట్టపెళ్ళి మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.