కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం మండల అధ్యక్షుల ఎన్నిక
భూపాలపల్లి టౌన్ ఆగస్టు 30 (జనం సాక్షి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఎస్ టి డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు పోరిక సమ్మయ్య అధ్వర్యంలో జిల్లా లోని ఎస్ టి డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులను మంగళవారం ప్రకటించారు. ముఖ్య అతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయి త ప్రకాశ్ రెడ్డి పాల్గొని నుతనంగా నియమితులైన మండల అధ్యక్షులుకు నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలోని ఆయా మండలాల ఎస్టి విభాగం అధ్యక్షులుగా నంగావత్ భాస్కర్ భూపాలపల్లి, భూక్య రాజు నాయక్.
చిట్యాల, అట్కర్ రాజు నాయక్ గణపురం, పిట్టల చంద్రమౌళి మహాదేవపూర్, పీర్ల రామకృష్ణ పలిమెల, అజ్మీర బిక్షపతి మలహర్రావు, అజ్మీర కిషన్ నాయక్ కాటారం,
బానోతు రవిందర్ రేగొండ మండలాల అధ్యక్షులుగా నియమించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులుబుర్ర కొమురయ్య, పలిమెల మండల అధ్యక్షులు చిన్నన్న, అనుసంపల్లి ఎంపిటిసి రఘునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|