కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సమాన్ పల్లి శేకర్
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సామన్ పల్లి శేకర్ ను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలo లోని దేగమ గ్రామానికి చెందిన సమాన్ పెళ్లి శేకర్, కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండి పార్టీకి సంబందించిన అన్ని పనులలో చురుగ్గా పాల్గొనడం తో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆయనను గుర్తించి మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులకు బోథ్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.