కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి ప్రకాష్ గౌడ్ గారి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య సత్యం శ్రీరంగం.

 *బండారి ప్రకాష్ గౌడ్ విగ్రహాన్ని దొంగిలించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి   సత్యం శ్రీరంగం డిమాండ్
కూకట్ పల్లి (జనంసాక్షి)
 బాలానగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కీ|| శే|| బండారి ప్రకాశ్ గౌడ్  విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా టీపీసీసీ అధికార ప్రతినిది  సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కూకట్ పల్లిలో మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పీజేఆర్ శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘ కాలం పాటు సేవలందించిన బండారి ప్రకాష్ గౌడ్  విగ్రహాన్ని గత ఐదు సంవత్సరాలుగా బాలా నగర్ హనుమాన్ కమాన్ దగ్గర ఉన్న విగ్రహాన్ని హెచ్ఎండిఏ అనుమతితో లోపలికి మారిస్తే ఆ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ఈరోజు తెల్లవారు జామున ద్వంసం చేసి విగ్రహాన్ని దొంగిలించటం జరిగింది. కావున ఇది అన్యాయమైన చర్యగా సత్యం శ్రీరంగం  తీవ్రంగా ఖండించారు. అదే విధంగా ఒక పధకం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని కొందరు వ్యక్తులు చూస్తున్నారని తీవ్రంగా ఖండించారు. వెంటనే దొంగిలించిన విగ్రహాన్ని తీసుకొచ్చి మాకు అప్పగించాలని, అదేవిధంగా హెచ్ఎండిఏ అనుమతి ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని యాదతద స్థితిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, బండారి నవీన్ గౌడ్, రాజు ముదిరాజ్, మల్లికార్జున్, మట్టే ప్రసన్న కుమార్, ముఖేందర్, మహేందర్, పుష్ప రాజ్, హేమంత్, వినోద్, పులిరాజు గౌడ్, సత్యపాల్ రెడ్డి, సాయి గౌడ్, మల్లేష్ యాదవ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.