కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం
కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం
డోర్నకల్, నవంబర్ 7, జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్ ను అసెంబ్లీ ఎన్నికల సీటు కేటాయించడంతో తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చి కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార రథని పూజ ప్రారంభించి ప్రచారం ప్రారంభించారు.గుడి సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం గొల్లచర్ల గ్రామ ఎక్స్ రోడ్,కాస్నాతండా, చాపల తండా వద్ద డాక్టర్ రామచంద్రనాయక్ డిజె సప్పట్లు, ఆటపాటలతో, టపాసులు కాల్చి శాలువాతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకొని డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కాల సుమీర్ జైన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నుండి రైల్వే స్టేషన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి సెంటర్లో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని, డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసిన డోర్నకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేడం ఖాయమని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓ సైనికులు లేక పనిచేయాలని రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత మాలోత్ నెహ్రు నాయక్ మా మిత్రులే అని ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సమన్యాయంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రామ గ్రామాన, గల్లి గల్లి కు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ 6 పథకాలను ప్రజలో తీసుకెళ్లాలని ఆయన అన్నారు. డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్జం పుచ్చుకున్న చిలుకోడు గ్రామ సర్పంచ్ రాయల వెంకటబాబు. కాంగ్రెస్ పార్టీ కాండవగప్పి పార్టీలో ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, యూత్ జిల్లా అధ్యక్షుడు భరత్ బాబు, జిల్లా నాయకులు బండి శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లెపల్లి రజనీకాంత్, కురవి మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, టౌన్ అధ్యక్షుడు రాజేందర్,డోర్నకల్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు రాము, బీసీ సెల్ టౌన్ ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన భాస్కర్, మాజీ ఎంపిటిసి బానోత్ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ సపవట్ శ్రీను, డిజె శ్రీను, బానోత్ దేవ్ సింగ్ నాయక్,మైనార్టీ నాయకులు కాసిం, జిల్లా నాయకులు పగిడిపల్ల వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.