కాజీపేట చేరుకున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్
వరంగల్: దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి లక్షలాది మంది సందర్శకులను మెప్పించిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్ నగరానికి చేరుకుంది. కాజీపేట రైల్వే జంక్షన్‌లో నాలుగు రోజుల పాటు జిల్లా వాసులను అలరించనుంది. జీవ వైవిధ్యం ముఖ్యాంశంగా రూపొందించిన ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను నిట్ ఇంచార్జి డైరెక్టర్ ఆచార్య రాంచంద్రయ్య ప్రారంభించారు. ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ సందర్శనకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనాంశాలు అలరిస్తున్నాయి. విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. సుమారు 16 బోగీలతో ఉన్న సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.