కాణిపాకం ఆలయంలో వనం-మనం

తిరుపతి,జూన్‌30(జ‌నం సాక్షి): కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో వనం మనం కార్యక్రమం శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు, మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…మొక్కలు నాటడం మానవాళికి శ్రేయస్కరమన్నారు. అధికారులు నక్షత్ర వనంలో మొక్కలు నాటారు. అనంతరం దేవాదాయ, అటవీ శాఖల సంయుక్తంగా ఆస్థాన మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ గీర్వాణీ పాల్గొని మాట్లాడుతూ…ప్రపంచానికి మొదటిగా మొక్కల ప్రాముఖ్యతను తెలిపింది భారతదేశమన్నారు. టెంకాయ కొట్టిన భక్తులకు ప్రతి ఒక్కరికీ మొక్కలను అందజేయాలని ఈఓ ను కలెక్టర్‌ ఆదేశించారు. సంప్రదాయాలకు గుర్తుగా చెట్లను పెంచాలని సూచించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి చెట్లను నరకడం మానుకోవాలని హితవు పలికారు.