కాణిపాకం ఉభయదారులు సమావేశం రసాభాస

చిత్తూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాణిపాకం ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఈవో తీరుపట్ల ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉభయదారులతో ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. తనకు సరైన ప్రాతినిత్యం ఇవ్వలేదని అలిగిన స్థానిక సర్పంచ్‌.. సమావేశానికి హాజరుకాలేదు. దీంతో భేటీ వాయిదా వేయాలని సర్పంచ్‌ వర్గం పట్టుబట్టింది. మొత్తానికి సమావేశం రసాభాసగా మారింది.

తాజావార్తలు