కామారెడ్డిలో కేసీఆర్‌కు మెజారిటీ రికార్డు ఖాయం

` జిల్లాతో  అనుబంధం మేరకే ఇక్కడి నుంచి పోటీ
` ఆరు గ్యారెంటీలను అస్సలు నమ్మకండి
` ఇక్కడి నుంచి సీఎం పోటీపై దేశమంతా ఆసక్తి
` కామారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్‌
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి):కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కెసిఆర్‌ ఇక్కడ పోటీకి దిగారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్‌ అలీ కామారెడ్డి సీటు తీసుకున్నారు. నాడు షబ్బీర్‌ అలీ బతిమిలాడితేనే కేసీఆర్‌ ప్రచారానికి వచ్చారు. కామారెడ్డితో కేసీఆర్కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి మా నానమ్మ ఊరు. గంపగోవర్ధన్‌ కోరిక మేరకే కేసీఆర్‌ ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. నెర్రెలు బారిన, నెత్తురు పారిన ఈ నేల సస్యశ్యామలం కావాలని కేసీఆర్‌ ఇక్కడ పోటీకి చేయబోతున్నారు. కేసీఆర్‌ ఏది చేసినా సంచలనమే. కేసీఆర్‌ పేరు ప్రకటించిన మరుక్షణమే గెలుపు ఖరారైంది. ఎమ్మెల్యే టికెట్లు రాని కులాల వారికి నామినేటెడ్‌ పదవులు కల్పిస్తాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది మా సిద్ధాంతం. తెలంగాణలో గెలవగానే మహారాష్ట్రలో గెలిచేలా ప్లాన్‌ చేసుకుంటున్నాం. దమ్మున్న నాయకుడు కావాలని మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కామారెడ్డిలో మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి.. దేశం నివ్వెర పోయి చూడాలి. మన పంచాయతీలు పక్కన పెట్టాలి.. అందరూ ఒక్కటి కావాలి.. పాత పగలను పట్టించుకోవద్దు. కామారెడ్డి మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేస్తాం. విూరు కోరినవన్నీ తీరుస్తాం. కాంగ్రెస్‌, బీజేపీ నేతలను తక్కువ అంచనా వేయద్దు. కాంగ్రెస్‌ నేతలకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తాయి. అదానీ పంపే డబ్బులు మోదీ దగ్గర బాగా ఉన్నాయి. బీజేపీది ఉత్త మేకప్‌.. కాంగ్రెస్‌ పాకప్‌. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తెలంగాణాకు తీరని ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వేగాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాడు నోటుకు ఓటు.. ఇప్పుడు సీటుకు రేటు. మేము ఎవ్వరికీ బీ టీమ్‌ కాదు.. ఆ ఖర్మ మాకు పట్టలేదు. ఆరు గ్యారంటీలని ప్రజలె నమ్మరు‘ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.  పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారని  ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల అవకాశమిస్తే ఏమి చేయని వారు, ఇప్పుడు మేం అది చేస్తాం… ఇది చేస్తామని మరోసారి మోసానికి తెరలేపుతున్నారని విమర్శించారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మకుండా.. మోసం చేసిన కాంగ్రెస్‌ను మోసం చేసి ఓడిరచాలన్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నమ్మి మోసపోవద్దన్నారు. 50 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనలో 70 లక్షల మందికి రూ.73వేల కోట్ల రైతుబంధు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వానాకాలం, ఎండాకాలం సాగుకాలం ఆరంభంలో ప్రతీ రైలు సెల్‌ఫోన్‌లో టింగ్‌ టింగుమంటూ రైతు బంధు వారి ఖాతాల్లో జమవుతోందన్నారు. రూ.43వేల కోట్లతో ఇంటింటికి తాగునీరందంచిన కేసీఆర్‌నే ప్రజలు నమ్మాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ఎవ్వరికీ ’బీ’ కాదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల ’ఏ’ టీంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో అనేక మంది వచ్చి పోతుంటారని ఎవ్వరిని నమ్మవద్దని కేటీఆర్‌ ప్రజలను కోరారు. ఇప్పటి వరకు తమకు అన్ని ఇచ్చింది కేసీఆరే అని ఇంకా ఇచ్చేది కేసీఆరే అని చెప్పండని ప్రజలను ఆయన కోరారు. పదేళ్లలో కేసీఆర్‌ అన్నీ ఇచ్చారని, ఇంకా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోట శుభవార్త వింటారని వెల్లడిరచారు. అల్లాటప్పా నాయకులు వచ్చి అన్నీ చేస్తామని మరోసారి మోసం చేసే ప్రమాదముందని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలను కేటీఆర్‌ కోరారు.
కెసిఆర్‌ కామారెడ్డి పోటీపై దేశమంతా ఆసక్తి
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌ పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టేనని  కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ కావాలని చెప్పారు. ఇక్కడ కేసీఆర్‌ గెలుపు ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీయేనని వ్యాఖ్యానించారు.  ఈ ఎన్నికతో దక్షిణ భారతదేశంలోనే సీఎం కేసీఆర్‌ సరికొత్త రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు. దక్షణ భారతదేశంలోనే హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టించబోతున్నారని తెలిపారు. జలసాధన ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నిధుల సేకరణకు కామారెడ్డిలోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. నెర్రెలు బారిన నేలలో పచ్చని పంటలు పండిరచా లన్నదే కేసీఆర్‌ ధ్యేయమని తెలిపారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. ధృడమైన సంకల్పం ఉంటుందని అన్నారు.సీఎం కేసీఆర్‌ ను కామారెడ్డి ప్రజలు గుండెల నిండుగా ఆశీర్వదించాలని కోరారు. కామారెడ్డి పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.  గంప గోవర్ధన్‌ విజ్ఞప్తి మేరకే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నార న్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్నారు. నాడు గంప గోవర్ధన్‌ పార్టీలోకి రావడంతో బీఆర్‌ఎస్‌ బలం మరింతగా పెరిగిందన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని కేసీఆర్‌ను గంప గోవర్ధన్‌ అడుగుతారని తాను భావించలేదని, ఇప్పటికే అభివృద్ధితో ముందుకు సాగుతోన్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన కోరినట్లు చెప్పారు.  8 మండలాల్లో స్థానిక ఎన్నికల్లో క్లాన్‌ స్వీప్‌ చేశామన్నారు.  ప్రతీ నాయకుడు స్థానిక బూత్‌ లో మెజార్టీకి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామం, వార్డులో మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు.   కామారెడ్డిలో మంత్రి కేటీఆర్‌ టూర్‌ కు ముందు నేతల వర్గపోరు బయట పడ్డింది. కేటీఆర్‌ కు వెల్‌ కం చెబుతూ నగరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, జిల్లా అధ్యక్షుల ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఫోటో పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గంప గోవర్ధన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి కేటీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. గంప గోవర్థన్‌ ఇక ఎమ్మెల్యే కారని తెలియడంతో ఆయన అనుచరులు కూడా పట్టించుకోవడం లేదు.

 

(కేసీఆర్‌కు ఛాతిలో ఇన్ఫెక్షన్‌
` ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్‌
ఛాతీలో కొద్దిగా సెకండరీ ఇన్ఫెక్షన్లు ఉన్నాయన్నాయని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్వరం తగ్గిందని, ఒకటి రెండు రోజుల్లో బయటికి వస్తారని శుక్రవారం కేటీఆర్‌ ఓ ఆంగ్ల న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ సీఎం ఆరోగ్యంపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, ఆ తరువాత బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ రావడం వల్ల కోలుకునేందుకు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటోందని వెల్లడిరచారు. కాగా, సీఎం కేసీఆర్‌ వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో వారం రోజులుగా బాధపడుతున్నారంటూ సెప్టెంబరు 26న కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడిరచిన విషయం తెలిసిందే. సీఎంకు ఇంటి వద్దే వైద్య బృందం సేవలందిస్తోందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతారని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. మొత్తంగా మూడు వారాలుగా కేసీఆర్‌ అనారోగ్యం కారణంగా పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు.