కామారెడ్డిలో డ్రగ్స్ కలకలం
కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
కామారెడ్డి,జనవరి3(జనంసాక్షి): జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు వారి వద్ద నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి ఆల్ఫాజాలం మత్తుమందును కొందరు హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ మత్తుమందు వాడితో త్వరగా దానికి బానిసలు అవుతారని, నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని అధికారులు తెలిపారు.