కామారెడ్డి ఆస్పత్రిలో సౌకర్యాల తిష్ట
వసతులు పెంచినా మారని పరిస్థితి
కామారెడ్డి,జూన్20(జనంసాక్షి): వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా కామారెడ్డి ప్రాంతీయాస్పత్రిలో శిశువైద్యం గగనమవుతోంది.వంద పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెలా ప్రసవాల సంఖ్య 300`400లకు చేరువలో ఉంటుంది. ప్రస్తుతం ఉవంద100 పడకలకు స్థాయిని పెంచినా ముందుస్తు అవసరాలకు అనుగుణంగా లేకపోవడం గమనార్హం. ఇది వరకు ఉన్న ఆస్పత్రిని ప్రసూతి విభాగానికి అప్పగించి మరోచోట జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిఉంది. ఇపుడున్న ఆస్పత్రిని
మహిళా ప్రసూతి ఆస్పత్రిగా మారిస్తే జిల్లా కేంద్రానికి నలువైపుల నుంచి వచ్చేవారికి అనువుగా ఉంటుంది.
ప్రసవాలతో వైద్యురాలిపై తీవ్ర పని భారం పడుతోంది. అదనపు వైద్యుల నియామకం అటకెక్కింది.ఈ విషయంలో పలుమార్లు వైద్యశాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా కామారెడ్డిలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ విధుల్లో చేరినా వారానికో గైర్హాజరవుతున్నారు. ప్రస్తుతం నలుగురు వైద్యులను నియమిస్తేనే సమస్యను అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ ఏర్పాటు చేస్తే శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. 24 గంటలపాటు శిశువైద్యానికి సేవలను పర్యవేక్షించడానికి అదనపు వైద్యులు, ప్రత్యేక నిధులు అవసరమని స్థానిక వైద్యులు అన్నారు. శిశువైద్యం మెరుగు పరిచేందుకు సర్కారు స్పందించి అధునాతన సదుపాయాలు కల్పించాలని, అప్పుడే కెసిఆర్ కిట్ లాంటి పథకాల ద్వారా ప్రసవాల సంఖ్యను పెంచగలుగుతామని అన్నారు.