కామారెడ్డి జిల్లాలో విషాదం..
ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య
కామారెడ్డి జనంసాక్షి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్‌కు చెందిన గజవాడ కుబేరం (60) గజవాడ లక్ష్మి (55)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కాగా, అనారోగ్య కారణాలతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.