కామారెడ్డి జిల్లా లొ దొంగ నోట్ల ముఠా అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22 (జనంసాక్షి);
దొంగ నోట్ల ముద్రణ చేసి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠా లోని ఐదుగురిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు . శనివారము జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి అడిషనల్ ఎస్పీ అన్యోన్య పట్టణ డిఎస్పి సోమనాథంతో కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముద్రణ నిందితుల వివరాలను తెలియజేశారు. దేవునిపల్లి పోలీసులు టేక్ రియల్ గ్రామ సమీపంలో వాహనాల ను తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ నుండి కామారెడ్డి వైపు వస్తున్న టవేరా ఏపీ 09 బిఎ 8339 గల వాహనం వాహనం పోలీసులను చూసి ఆపకుండా పారిపోతుండగా పోలీసులు పట్టుకొని అందులోని మతిన్ హుస్సేన్,మోయిజ్ లను విచారించగా వారి వద్ద 150 500 రూపాయల దొంగ నోట్లు,3 కత్తులను స్వాధీనం చేసుకొని విచారించగా నిందితులు 330- 500 దొంగ నోట్లను ముద్రించి దీపావళి సందర్భంగా వాటిని చలామణి చేయడానికి వెళుతున్నట్లు తెలిపారు. వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేసి విచారించగా వీరితో పాటు బైంసా పట్టణానికి వెళ్లి మహమ్మద్ ఉమర్, షేక్ హుస్సేన్, మతిన్, ఓ బైద్ ఖాన్, లను అరెస్టు చేసి వారి వద్ద 330 దొంగ నోట్లను, రెండు బైక్ లను, ప్రింటర్లు, స్కానర్లు, డెస్క్ టాప్ లు,ఇంక్ జెట్లు, కీబోర్డు పెన్ డ్రైవ్ తదితర వస్తువులను స్వాధీనం చేసు కొన్నట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఉమర్ గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులు అందరూ యూట్యూబ్లోని వీడియోలను చూసి దొంగ నోట్ల తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించి వాటి ద్వారా దొంగనోట్ల ముద్రణ సులభంగా చేసి చలామణి చేద్దామని అత్యాశకు పోయి పోలీసులకు దొరికిపోయారని ఎస్పీ తెలిపారు. ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సిఐ శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ సీఐ వీరయ్య , దేవునిపల్లి ఎస్ఐ ప్రసాద్, సిసిఎస్ సిబ్బంది ఎస్సై ఉస్మాన్, రాజేశ్వర్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, శ్రీనివాస్ ,దేవునిపల్లి పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సి సి ఎస్ సిబ్బంది లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.