కారును వీడనున్న ఆదివాసి నాయకులు
కారును వీడనున్న ఆదివాసి నాయకులు
ములుగు ప్రతినిధి:-ములుగు జిల్లాలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. కారును వీడి పలువురు ఆదివాసి సంఘం ముఖ్య నాయకులు హస్తం గూటికి భారీగా వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల నుండి పలువురు వార్డు సభ్యులు హస్తం గూటికి చేరారు. హస్తం గూటికి మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్.. ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పోడేo శోభన్ చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ములుగు జిల్లా కన్నయ్య గూడెం మండలంలో సర్వాయి గ్రామానికి చెందిన పోడేo శోభన్ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. 2005 సంవత్సరంలో సర్వాయి గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా. పనిచేశారు. ఉమ్మడి ఏటూరునాగారం మండల తుడుం దెబ్బ అధ్యక్షులుగా ఆరు సంవత్సరాలు పనిచేసే. ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తు. ఆదివాసి ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ఉద్యమిస్తున్నారు. మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గా పనిచేశారు. నిరంతరం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ద్వేయంగా పనిచేసే అందరి మన్నాలను పొందుతున్నారు. ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ఇలాంటి లావాదేవీల జోలికి పోలేదు. పూర్తిగా నష్టపోయారు ఉండడానికి స్వంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు.
బి ఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు లేదని. కారు ను విడిచి హస్తం గూటికి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బిఆర్ఎస్ పార్టీ నాయకులు హస్తం గూటికి చేరకుండా నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నారు