కారు జోరు..బీజేపీ బేజారు..
వాడవాడనా గులాబీకి జై..
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 23(జనం సాక్షి)
మునుగోడు ఉప ఎన్నికల్లో బాగంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు..రోజు రోజుకు టీఆర్ఎస్ జోరు మరింత పెరుగుతుంది..ఈ రోజు ఇంటింటి ప్రచారంలో బాగంగా చౌటుప్పల్ 19 వ వార్డులో ఎమ్మెల్యే,ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ ప్రచారం నిర్వహించారు..టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఓటు అభ్యర్థించారు..భగత్ నగర్ కు చెందిన ప్రజలు బారీ సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారని,అతని అహంకారం,స్వార్థబుద్దిని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ ప్రాంతం అద్బుతంగా అభివృద్ది చెందుతుందన్నారు..ప్రజలు తమవైపే ఉన్నారని. కేసీఆర్ చేపట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు.గ్యాస్,పెట్ రోల్ డీజిల్ దరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలంటే ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు..యువతను తమ రాజకీయావసరాలకోసం బీజేపీ వాడుకుని వారిలో విద్వేష భావనను రేకెత్తిస్తుందని,యువకులు అభివృద్దివైపు ఉన్న టీఆర్ఎస్ వెంట నడవాలన్నారు..దేశంలో ఎక్కడా లేని విదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు..ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని,18 వేల కోట్ల కాంట్రక్టర్ కు బుద్దిచెప్పి ప్రజల పార్టీ టీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు..ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ లు,స్థానికనాయకులు,ముఖ్యనాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు..
Attachments area