కారెక్కనున్న వివేక్‌

1A

హైదరాబాద్‌,జూన్‌ 12(జనంసాక్షి):మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌లు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 15న ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.కాగా మాజీ ఎంపీ వివేక్‌ ఇది వరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోచేరిన విషయం తెలిసిందే.వీరితో పాటు మరికొందరు నేతలు కూడా గులాబీ కండువ వేసుకోనన్నట్లు సమాచారం, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కూడా పార్టీ మారనున్నారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు జువ్వాడి నర్సింగరావు, రాజు తదితరులు కూడా తెరాసలోకి మారనున్నారు.