కారెక్కిన బస్వరాజు సారయ్య

1

హైదరాబాద్‌,ఫిబ్రవరి 23(జనంసాక్షి): మరో సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండ్‌ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. బస్వరాజు సారయ్యతో పాటు వరంగల్‌ అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, వరంగల్‌ టౌన్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ విద్యాసాగర్‌ తదితరులు టీఆర్‌ఎస్లో చేరారు. వారనికి గులాబీ కండువాలు కప్పిన కెసిఆర్‌ పార్టీలోకి ఆహ్వినించారు. తాను ప్రజలు, కార్యకర్తల సూచన మేరకే.. తెలంగాణ సర్కారుకు అండగా ఉండాలని  నిర్ణయించుకున్నానని సారయ్య చెప్పారు. కేసీయార్‌ దిశానిర్దేశనం మేరకు పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, సారయ్య అనుచరులు పాల్గొన్నారు. మరోవైపు బస్వరాజు సారయ్యపై కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. మరోవైపు బస్వరాజు సారయ్యపై కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీలో చేరడానిక ముందే ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుసుకుని సస్పెన్షన్‌ వేటేసింది.  ఈమేరకు పిసిసి ఒక ప్రకటనలో పేర్కొంది. సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరునున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సారయ్యను పార్టీ నుంచి బహిష్కరించినట్టు సమాచారం. వరగంల్‌ గ్రేటర్‌ ఎన్నికలకు ముందు సారయ్య చేరికతో అక్కడ కాంగ్రెస్‌కు గడ్డుకాలం దాపురించనుంది.మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారయ్య విభజనకుముందు మంత్రిగా పనిచేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడుగుల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని  మాజీ మంత్రి బసవరాజు సారయ్య స్పష్టం చేశారు. అందుకోసమే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో బసవరాజు సారయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం బసవరాజు సారయ్య విలేకర్లతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీనే అని ఈ సందర్భంగా సారయ్య తెలిపారు. జాతీయపార్టీ కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. అయితే ఆ పార్టీని విమర్శించదలచుకోలేదని చెప్పారు. వరంగల్‌ అభివృద్ధికి కృషిచేస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌ చేపడుతున్న… అభివృద్ధి కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం అవుతామని బసవరాజు సారయ్య అన్నారు. అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఆశ అన్నారు.

సారయ్య నాకు మంచి మిత్రుడు: సీఎం

మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తనకు మంచి మిత్రుడని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం తన పద్దతిలో పనిచేసిన సారయ్యను కలుపుకుని పోతామని తెలిపారు. సోదరుడు అనిశెట్టి మురళికి సీఎం సాదర స్వాగతం పలికారు. వరంగల్‌ అభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నమని తెలిపారు. నగరానికి ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.