కార్డెన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల రణధ్యానగర్‌లో బుధవారం  తెల్లవారు జామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ నేతృత్వంలో వంద మంది పోలీస్‌ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి ఆధార పత్రాలు లేని 22 బైక్‌ లు, 4 ఆటోలు, రెండు బెల్ట్‌ షాపుల్లోని 50 బీర్‌ బాటిళ్లు, 20 వేలు విలువ చేసే గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా అక్రమార్కులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుట్కా అమ్మకందారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ప్రజల రోణ కోసమే తనిఖీలు చేస్తున్నామని, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

తాజావార్తలు