కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది
రుద్రూర్(జనంసాక్షి)
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గాంధీ ఎంపీపీయస్ పాఠశాలలో శుక్రవారం తెరాస మండల ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జడ్పీటీసీ నారోజి గంగారాం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని అన్నారు. గత పాలకుల హయాంలో విద్యా ర్థులకు అరకొరగా పుస్తకాలు అందేవని అన్నారు
అక్కపల్లి నాగేందర్:
గత ఆంద్ర పాలకుల హయాంలో కొన్నిచోట్ల విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరినా పుస్తకాలు పాఠశాలలకు చేరేవికావు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు.
మండల అధ్యక్షుడు పత్తిలక్ష్మణ్:
తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించేందుకు అన్ని పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందని. సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది తెలిపారు.
మాజీ విండో చైర్మన్ పత్తిరాము:
పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రతి పాఠ్య పుస్తకానికి ఒక కోడ్ నంబర్ ముద్రించి జిల్లాలవారీగా చేర వేస్తున్నది. దీనిద్వారా ఏ పాఠశాలలో ఏ పాఠ్యపుస్తకం పంపిణీ జరిగిందో సులభంగా తెలిసిపోతుందిని తెలిపారు
విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి:
విద్యార్థులకు పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూడాలని, ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నారోజి గంగారాం,ఎంపిడివో బాల గంగాధర్,సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, ఖలీమ్, జమీల్, పంచాయితీ ఈవో విట్ఠల్ రెడ్డి , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనీసా, పాఠశాల సిబ్బంది భూలక్ష్మి, శిరీష, విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.