కార్పొరేట్ కంపెనీలే ప్రణబ్‌ను గెలిపించాయి
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి):
కార్పోరేట్ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తమ స్వప్రయోజనాలు కాపాడు కొనేందుకు ముందు ముందు జరిగే ప్రయోజనాల కొరకు కార్పోరేట్ కంపెనీల వారికి అమితమైన లాభాలు చేకూర్చే వ్యక్తికే ఆర్థికమంత్రి పదవిని కట్టబెట్టడానికి ప్రణబ్ లాబీలు జరుపుతున్నారనీ ఆరోపించారు. ఆదివారం హైద్రాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు కార్పోరేట్ అను కూల పథకాలను వేగంగా అమలు చేయడంలో మంద కొడిగా వ్యవహరిస్తున్నారనీ, 2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే అపుడు కూడా తమకు అనుకూలంగా వ్యవహ రించే వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఉద్దేశ్యం తోనే ప్రణబ్ రాష్ట్రపతిగా గెలిచేందుకు సర్వశ క్తులు ఒడ్డారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపుల కోసం జాతీయ స్థాయిలో ఉద్య మాన్ని నిర్మించాలని నిర్ణయిం చినట్లు ఆయన తెలిపారు. అలాగే ఎఫ్‌డీఐ పైరవీల కోసం అమెరికా కంపెనీలు దొడ్డి దారిన ప్రయత్నాలు ఆరంభిం చాయని దీన్ని కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం సురువరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.