కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా కేడీసీసీ బ్యాంక్ సేవలు…మేనేజర్ స్రవంతి..
శంకరపట్నం జనం సాక్షి నవంబర్ 7
కార్పొరేట్ బ్యాంకులకు ధీతుగా కేడీసీసీ బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందిస్తుందని కేశవపట్నం కేడిసిసి బ్యాంక్ మేనేజర్ స్రవంతి అన్నారు. శనివారం మండలంలోని అంబాలపూర్ గ్రామంలో కేశవపట్నం కేడీసీసీ బ్యాంక్ గ్రామ ఉపసర్పంచ్ మడ్డి రవి ఆధ్వర్యంలో ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేనేజర్ స్రవంతి మాట్లాడారు. కేడీసీసీ బ్యాంకు నాబార్డ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ బ్యాంకులో మాదిరిగా రైతులకు ఖాతాదారులకు సేవలు అందిస్తుందని రైతులు ఖాతాదారులు కేడీసీసీ బ్యాంకు సేవలను వినియోగించుకొని బ్యాంకులు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన సదస్సులో సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి గ్రామస్తులు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.