కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు
…
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని సిఐటియు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ సమావేశం బెల్లంకొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ. స్వతంత్రం పూర్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను తీసుకొచ్చారని వీటి ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దుచేసి పెరిగిన ధరలకు అనుకూలంగా కార్మికులకు కనీస వేతనాలు అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుంచు విజయేందర్. సిఐటియు మండల నాయకులు చెక్క పరశురాములు. పెంటయ్య. లింగం. మల్లయ్య. ఎలా కొమురయ్య. కుక్క సావు నరసింహులు. లక్ష్మణ్. యాకం రెడ్డి. బాలరాజు. సత్తయ్య ఉన్నారు