కార్మిక నేతలు యాజమాన్యం
పెంపుడు జంతువులు
– ఐక్యపోరాటాలతోనే సత్ఫలితం – సీఐటీయూ నేత పి.రాజారావు
గోదావరిఖని, జూన్ 12, (జనంసాక్షి):
కొన్ని కార్మిక సంఘాల నేతలు సింగరేణి యాజ మాన్యానికి పెంపుడు జంతువులని సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రాజారావు ఆరోపిం చారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఇప్పటి వరకు సింగరేణి గుర్తింపు సంఘం గా ఉన్న సంఘాలు కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించకపోగా… మళ్ళీ ఎన్నికల్లో అధికారం కోసం రకరకాల వాగ్దానాలతో కార్మికు లను మభ్యపెడుతున్నారన్నారు. ఆధాయపు పన్ను మినహాయింపు, వారసత్వ ఉద్యోగాల ఏర్పాటుకు, రూ.25వేల అడ్వాన్స్ మాఫీ సింగరేణి యాజ మాన్యం పరిధిలో లేకపోయినప్పటికి కార్మికులను వినాశకరమైన పద్దతుల్లో నష్టపరచడానికి సిద్దమ వుతుందన్నారు. ఇప్పటివరకు సాధించని విషయా లను సాధించినట్లుగా కార్మికులకు డబ్బాలు కొడుతున్నారన్నారు. ఎర్రజెండాకున్న స్థాయిని దిగజార్చి కొన్ని కార్మిక సంఘాలు బొగ్గుగనులను బార్లుగా మారుస్తున్నాయన్నారు. కార్మిక సంఘాల మధ్య ఉన్న విభేదాలను యాజమాన్యం చాకచక్యం గా వాడుకుని… తమ విధానాలను కార్మికులపై రుద్దుతుందన్నారు. అందుకే కార్మిక సంఘాలు ఐక్యంగా సమగ్ర ప్రణాళికతో… ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు పి.రాజారెడ్డి, మొగిలి, తిరుపతి, మెండె శ్రీనివాస్, ఎస్.మల్లిఖార్జున్, వెంకటేష్ బాబు, కృష్ణ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.