కార్యకర్తలకి అండగా రామ్మోహన్ రెడ్డి
దోమ జనవరి 27(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావలి ఆంజనేయులు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తను అందుబాటులో లేనందువలన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులచే 5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు . జంగయ్య, లక్ష్మయ్య,చాపల శ్రీనివాస్, కొత్త అంజిలయ్య, గురునాథ్ రెడ్డి,కాజామియా రమేష్ వెంకటయ్య, కొత్త చంద్రయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.


