కాలుష్య కారకమైన కంపెనీలకు అనుమతులు రద్దు చేయాలి…
స్థానిక ఎమ్మెల్యేకు సోయి లేదా..
వంట వార్పులో పాల్గొన్న కుంభం.
యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిద్ధం రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామంలో వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.
ఇప్పటికే తుక్కాపూర్ గ్రామంలో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ద్వారా వాయి కాలుష్యంతో జల కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గ్యాస్ ఫ్యాక్టరీకి కావలసిన రా మెటీరియల్ కోసం క్వార్జ్ పౌడర్ తయారు చేయడానికి కంపెనీకి అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. తుక్కాపురం గ్రామానికి సంబంధించిన జేఏసీ యువకులు ఐదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు అనుమతులు రద్దు చేయాలని వినతిపత్రం అందజేసిన ఇంతవరకు కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రిలే నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు తెలుపుతూ అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబెర్ తంగేళ్లపల్లి రవికుమార్,బెండ శ్రీకాంత్,జిల్లా బిసి సంఘం అధ్యక్షులు రావుల రాజు,
నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.