కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

` కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ..
గజ్వేల్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్‌ దృష్టి సారించారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం హరీశ్‌రావు ఎర్రవెల్లి వెళ్లారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌, దామోదర్‌ రావు తదితరులతో పార్టీ అధినేత సమావేశమయ్యారు.