కాళేశ్వరం జాతీయ హోదాపై మౌనం

విమర్శలతోనే కేంద్రం ఎదురుదాడి
విన్నపాలను పట్టించుకోని కేంద్రం
హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి ) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా విషయంలో కేంద్రం మౌనంగానే ఉంటుంది. అదలావుంటే అవినీతి అంటూ విమర్శలు చేస్తూ బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంది. బిజెపి నేతలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. విమర్శల దాడిని పెంచారు. అయితే దానికి హోదా దక్కితే సాయం అందే అవకాశాలను మాత్రం పట్టించుకోవడం లేదు. అలా చేసివుంటే బిజెపికి కలసి వచ్చేది. కానీ అలాంటి ఆలోచన కానరావడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న హావిూలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానిని పలుమార్లు కలిశారని, నీతిఅయోగ్‌ సమావేశంలో రెండుసార్లు కలిశారని, పలుమార్లు కేంద్ర మంత్రులను కూడా కలిశారని టిఆర్‌ఎస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయహోదా, పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఎన్టీపీసీకి బొగ్గులింకేజీలు, గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవర్సిటీ, బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు, ఉద్యోగుల విభజన వంటి సమస్యలను పరిష్కారించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నా..వాటిని దాటవేసింది. నిజానికి విభజన తరవాత పారిశ్రామిక అభివృద్ది, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ పోటీపడి పనులు చేపడుతున్నారు. అలాగే అభివృద్ది కోసం పరుగులు తీస్తున్నారు. దేశంలో బహుశా ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగినంతగా అభివృద్ది మరే రాష్ట్రంలోనూ జరగలేదు. రాజకీయంగా ఎన్ని
విభేదాలు ఉన్నా అభివృద్ది నినాదంలో కెసిఆర్‌ పనిచేస్తున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆకట్టుకుంటోంది. ఇది ఓ రకంగా శుభసూచకంగానే భావించాలి. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం ఎలా ఉండాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. విమర్శలను తట్టుకుని జవాబిస్తున్న విభిన్న తరహాలు ఈ రాష్టాల్ర అభివృద్దికి ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.కమిట్‌మెంట్‌ ఉన్న లీడర్లు సిఎంలుగా ఉండడంతో పనులు కూడా అదే కోవలో సాగుతున్నాయనడానికి తెలంగాణ ఉదాహరణ. లక్ష్యం మాత్రం అభివృద్ది కావడం వల్ల పారిశ్రామికవేత్తలు సైతం పోటీ పడే పరిస్థితి ఏర్పడిరది. అందుకే పారిశ్రామిక ప్రగతి ఈ మూడు నాలుగేళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇందుకు కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. అందుకు అనుగుణంగా చేయూతను ఇవ్వాలి. సమస్యలతో ఆడుకోకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి.