కాళేశ్వర వద్ద గోదావరి ప్రవాహం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జనంసాక్షి ): కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద 11.040 విూటర్ల ఎత్తులో ప్రవహం కొనసాగుతోంది. అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 7,31,240 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 1,93,613 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.44 టీఎంసీలకు చేరింది.