కాళోజీ సేవలు చిరస్మరణీయం
అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయం నందు ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
కాళోజీ జయంతి, తెలంగాణ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అలంపూర్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్ తో కలసిహాజరై నారు.ఈసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిచారు.
ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ సమాజంలో బావితరాలుకైనా చెరగని చుక్క కాళోజీ నారాయణ గారు, కవిగా సామాజిక నాయకుడిగా, ఆయన రచనలతో తెలంగాణ సాయుధపోరాటంలో గాని తెలంగాణ ఉద్యమంలో గాని పెత్తందారుల ఆగడాలను, దుర్మార్గాలను తన రచనల ధ్వారా గేయాల ధ్వారా తెలియజేస్తూ ఎన్నో ఎన్నెన్నో పెత్తందారుల అణచివేత దారుల కుట్రలను పటాపంచలు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరిచిన మహా గొప్ప మేధావి అన్నారు.అని అలాంటి వారు మన తెలంగాణలో పుట్టడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు.
ఈలాంటి మహోన్నతమైన వ్యక్తికి నాటి ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించిందని తెలంగాణ ఏర్పాటులో ఆయన చేసిన పోరాటం, తెలంగాణ ఉద్యమానికి ఎప్పటికప్పుడు తన బావజాలంతో ఉత్తేజపరుస్తూ తెలంగాణ వైతాళికుడిగా నిలిచరని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళోజీ గారి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవం గా జరుపుతుందని,అంతేకాకుండా ఆయన పేరుమీద కాళోజీ పురస్కారము అందజేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..