కాశిబుగ్గ పద్మశాలి పరపతి సంఘం వార్షికోత్సవం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 23(జనం సాక్షి)
కాశిబుగ్గ పద్మశాలి పరపతి సంఘం 14వ వార్షికోత్సవం ఆదివారం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఆదాయ వ్యయము పట్టికను సభ్యులకు సమర్పించడం జరిగినది ప్రతి ఒక సభ్యునికి వాటాదనం రూపాయలు 33965 సమర్పించడం జరిగినది. పద్మశాలి పరపతి సంఘం నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్షులుగా గుత్తికొండ నవీన్ ప్రధాన కార్యదర్శిగా కొణతము శ్రీనివాస్ . కోశాధికారిగా దాసరి శ్రీనివాసు ను ఎన్నుకోవడం జరిగినది. సభ్యులుఏకగ్రీవ ఆమోదం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలోకాశీబుగ్గ వర్తక సంఘం కోశాధికారి మండల శ్రీరాములు. గొనే జగదీశ్వర్ . గుండు చంద్రమౌళి . ఎలక్షన్ ఆఫీసర్ నిర్వహించారు మరియు పద్మశాలి పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.