కాశీయాత్రకు వెళ్లిన కాకినాడ వాసులు క్షేమం: ఎస్పీ
కాకినాడ,మే4(జనంసాక్షి): కాశీ వెళ్లిన కాకినాడ వాసులు క్షేమంగా ఉన్నారని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ఇదంతా లోవరాజు సృష్టించిన గందరగోళం అని, అతని మానసికస్థితి బాగోలేదని వివరించారు. అసలు ఎవరిపైనా దాడి జరగలేదని వారణాసిలో రైలు దిగగానే తప్పిపోయిన లోవరాజు చిన్న ప్రమాదంలో గాయపడ్డాడని తెలిపారు. ఈ సాయంత్రం వారంతా కాశీ నుంచి బయలుదేరుతున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. కాశీయాత్రకు వెళ్లి దుండగుల దాడిలో గాయపడిన కాకినాడ వాసుల్లో ఇద్దరు మృతిచెందారని, బాధితుల్లో ఒకరైన లోవరాజు ఈ విషయాన్ని వారణాసి పోలీసులకు తెలిపారని సమాచారం వచ్చింది. మిగతావారు రైల్లో పరిచయమైన వారి వద్దే ఉన్నట్లు వివరించారు. కాకినాడలోని గొల్లపేటకు చెందిన 8మంది ఏప్రిల్ 29న కాశీయాత్రకు వెళ్లారు. మే1 తేదీన మొగల్‌సరై రైల్వేస్టేషన్ దిగారు. అనంతరం వారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారణాసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందాన్ని వారణాసికి పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. అయితే ఎస్పీ ప్రకటనతో ప్రమాదం అంతా ఉత్తిదే అని తేలిపోయింది