కాశ్మీర్‌లో దారుణ హింస

– అహింసావాదానికి తిలోదకాలు
– కర్ఫ్యూతో కేంద్ర పాలన సాగిస్తుంది
– మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌
రాజమండ్రి, అక్టోబర్‌ 1 (జనంసాక్షి):కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కర్ఫ్యూతో కేంద్రం పాలన సాగిస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఉండవల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని.. గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో కర్ఫ్యూ నడిపిస్తోందని విమర్శించారు. అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదేనని అమిత్‌ షా చెబుతున్నారని, పాకిస్తాన్‌ కూడా మనదే అని, గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్‌ పార్టీని అంబేద్కర్‌ ఎన్నడూ సమర్థించలేదన్నారు. ఆయన వాస్తవాలను మాత్రమే చెప్పారని అన్నారు. నిజానికి ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తాననడంలో తప్పులేదని, కానీ  బీజేపీ పుట్టిందే ఈ సిద్దాంతం విూద అని, ఆర్టికల్‌ రద్దు అనేది డిప్లమసీతో చేయాలి. సైన్యంతో కాదంటూ మోదీ సర్కారు తీరును విమర్శించారు. పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ జిన్నాతాత రాజ్‌పూత్‌ వంశానికి చెందినవారని, అబ్దుల్‌ భట్‌ కూడా బ్రాహ్మణుడే అని, వీరంతా ఇస్లాంలోకి వెళ్లినవారేనని అని తెలిపారు. సాయిబాబా గుడికి వెళ్లొద్దని శంకరాచ్యా పీఠాధిపతే చెప్పారని, నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో… ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదని ఉండవెల్లి అభిప్రాయాపడ్డారు. అంతేకాదు నేడు గూగుల్‌ సెర్చ్‌లో ఆర్టికల్‌ 370 అనేది లేదని, కశ్మీర్‌ ఎంపీలు కూడా భారత రాజ్యాంగం విూదనే ప్రమాణం చేస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం గాంధీ సిద్దాంతానికి విరుద్ధంగా పనిచేస్తోందని ఉండవల్లి విమర్శలు గుప్పించారు.