‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
హైదరాబాద్: దానా తుఫాన్ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్లలో భువనేశ్వర్, హౌరా, ఖరగ్‌పూర్, పూరీ, తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు, రామేశ్వరం, సికింద్రాబాద్, తిరుపతి , షాలీమార్, మాల్డా, గౌహతి, కన్యాకుమారి, చెన్నై, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లే ఎక్కువగా ఉన్నాయి.