కాశ్మీర్‌ ఆందోళనల వెనుక పాక్‌ హస్తం

5

– రాజ్యసభలో రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి పాకిస్థానే కారణమని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారతీయ భద్రతా దళాలను, వాళ్లు బంధువులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు బెదిరిస్తున్నారని ¬ంమంత్రి తెలిపారు. ఒకవేళ పాకిస్థాన్‌తో ఏవైనా చర్చలు జరిగితే అది కేవలం పాక్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌ అంశంపైన మాత్రమే ఉంటుందని, కశ్మీర్‌ అంశంపై చర్చలు ఇక ఉండవన్నారు. జమ్మూకశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేసే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని ఆయన అన్నారు.  రాజ్యసభలో ఆయన కశ్మీర్‌ అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. కశ్మీర్‌ హింసకు పాకిస్థాన్‌ కారణమని చెప్పేందుకు తాను వెనకాడడం లేదని మరో సారి రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో కశ్మీర్‌ అంశాన్ని సభలో నాలుగవసారి చర్చించారు. దాదాపు 33 రోజులుగా కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాది బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. ఈ అంశంపై ఇవాళ రాజ్యసభలో మరోసారి చర్చించారు. కశ్మీర్‌ ప్రజలు శాంతియుత జీవనం కొనసాగిస్తున్నారని తాను చెప్పలేనని, కానీ వాళ్లకు అన్ని మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. రాళ్లు రువ్వడం వల్ల కశ్మీర్‌లో సుమారు 100 అంబులెన్సులు దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. అయినా మరో 400 అంబులెన్సులు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని వసతలు ఏర్పాటు చేస్తోందన్నారు. వీలైనంత సంయమనం పాటించాలని భద్రతా దళాలకు సూచించినట్లు ఆయన తెలిపారు. కశ్మీర్‌ సమస్యపై ఈనెల 12న అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించ నున్నారని, ఆ సమావేశానికి ప్రధాని కూడా హాజరవుతారన్నారు. రావణకాష్టంలా రగులుతున్న కశ్మీర్‌ అల్లర్లపై ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గత నెల 23, 24 తేదీల్లో తాను శ్రీనగర్‌లో పర్యటించినప్పుడు పలువురు ప్రతినిధులను, ముఖ్యమంత్రిని కలిసి చర్చించినట్టు తెలిపారు. అక్కడి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నట్టు తానైతే చెప్పలేను కానీ అక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు..