కాశ్మీర్‌ ప్రజలకు అండగా ఉంటాం

3
పాకిస్తాన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య

ఇస్లామాబాద్‌,ఆగస్టు 14(జనంసాక్షి):

తమ స్వతంత్ర దినోత్సవం నాడు మరోసారి కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్‌. తమ స్వతంత్ర దినోత్సవాన్ని కశ్మీర్‌ స్వతంత్రానికి అం కితం చేస్తున్నట్లు పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌లో జరిగిన పాక్‌ స్వతంత్ర వేడుకల సంద ర్భంగా ఆయన ఈ కామెంట్స్‌ చేయడం గమనార్హం. భారత్‌కు ఒక రోజు ముందు ఆగస్ట్‌ 14న పాక్‌ తమ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబం ధాలు బాసిత్‌ తాజా వ్యాఖ్యలతో మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. కశ్మీర్‌ అంశంపై చర్చిదా ్దమన్న పాక్‌ ప్రతిపాదనను భారత్‌ తిరస్కరించిన తర్వాతి రోజే బాసిత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశే షం.సరిహద్దులో ఉగ్రవాదాన్ని పాక్‌ పెంచిపోషిస్తున్న కారణంతో ఈ నెల 9న బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీ చేసింది. భారత్‌తో సంబంధాలను మెరుగపరచుకునేందుకు పాకిస్థాన్‌ ఎప్పు డూ ప్రయత్నించిందని తన స్వతంత్ర దినోత్సవ ప్రసం గంలో బాసిత్‌ అన్నారు. ఆయన ఈ కామెంట్స్‌ చేయడా నికి కొద్ది సమయం ముందే లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ దగ్గర పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ మరోసారి కాల్పులకు తెగబడిం ది. అటు వాగా బోర్డర్‌లో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకుం టుండగానే ఇటు కాల్పులకు పాల్పడటం గమనార్హం.