కిరణ్‌ బేడీ అవకాశవాది

3

-ఆపే ముఖ్యమంత్రిని చెస్తామంది

-భాజాపాలో ఎందుకు చేరింది

-ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌  కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,జనవరి29: ఢిల్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల వేడి ఊపందుకుంది.  ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీకి అప్పట్లోనే ఆ పదవిని ఇవ్వడానికి ఆఫర్‌ చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ తాజాగా స్పష్టం చేశారు.భాజాపాలో కిరణ్‌ చేరడం  ఓ అవకాశవాదంగా పేర్కొంటూ గురువారం ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటూర్యూలో కేజీవ్రాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ పోటీకి దిగేనప్పుడే ఆమెకు సీఎం పదవిని ఆఫర్‌ చేశామని తెలిపారు. కిరణ్‌ బేడీ విధివిధానాలు నచ్చే తాము అప్పట్లో ఆ పదవికి ఆమెను ఆఫర్‌ చేశామన్నారు. అయితే ఆమె తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో తాను దిగ్భాంతికి గురయినట్లు కేజీవ్రాల్‌ తెలిపారు. కిరణ్‌ బేడీని బీజేపీ ఎన్నికల్లో దింపి బలిపశువును చేసిందని కేజీవ్రాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కిరణ్‌ బేడీ తనను విషపూరితమైన వ్యక్తిగా వ్యాఖ్యానించినా.. ఆమెపై తాను ఎప్పటికీ  ఆ తరహా వ్యాఖ్యలు చేయబోనన్నారు. ఫిబ్రవరి 10 తరువాత కిరణ్‌ బేడీనీ బీజేపీ మరచిపోవడం ఖాయమని ఒక ప్రశ్నకు  సమాధానంగా చెప్పారు.