కిలోన్నర గంజాయి పట్టివేత

తిమ్మాపూర్, అక్టోబర్ 20 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని సాక్షి దినపత్రిక కార్యాలయం సమీపంలో గంజాయి సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తుల నుండి కిలోనర గంజాయిని పట్టుకున్నట్టు స్థానిక ఎస్సై శశిధర్ రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం పాయకరావుపేటకు చెందిన ఏనుగు సురేష్ (22), కీర్తి ఇశ్రయెల్, వెల్లురుకట్ట సందీప్ కుమార్ (24) నివాసం బోయిన్ పల్లి, సికింద్రాబాద్ అను ముగ్గురు వ్యక్తులు తమ వద్ద సుమారు ఒకటిన్నర కిలోల గంజాయి కలిగియుండగా తిమ్మాపూర్ పోలీసులు వారిని పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.